Tuesday, July 29, 2008

'రెడీ' నాకెందుకు నచ్చలేదంటే..


రెడీ చిత్రాన్ని గందరగోళంగా తీసిన ఘనత పూర్తిగా దర్శకుడిదే. హీరో రాం చక్కగా నటించి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బొమ్మరిల్లు చిత్రంలో అద్భుతంగా నటించిన జెనీలియా ఈ చిత్రంలో అత్యంత పేలవమైన నటనను ప్రదర్శించింది.


ఇక ప్యాడింగ్ రోల్స్ విషయానికొస్తే...


నాజర్ నటన గురించి చెప్పక్కర్లేదు..వెండితెరకు దొరికిన మరొక నవరసనటనా సార్వభౌముడు..


తాత పౌరుషానికి తగ్గట్టుగా ప్రవర్తించి..వెంటనే అమ్మతో తిట్లు తిని చిన్నపుచ్చుకునే పాత్రలో చిట్టినాయుడు అదరగొట్టాడు..


తను సృష్టించిన పాత్రలే తనముందుకొచ్చి తనను బాగా పరిచయస్తుడిగా మాట్లాడే సందర్భాలలో కలిగే అయోమయాన్ని బ్రహ్మానందం చక్కగా పండించారు.


ద్వితీయార్ధం ఎక్కువ గందరగోళంగా మారింది. పాటలు యువతను ఎక్కువగా అకట్టుకునేటట్టుగా వున్నాయి.


శ్రియాఘోషాల్ పాడిన పాట బాగుంది.


మొత్తమ్మీద రెడీ చిత్రానికి నేనిచ్చే మార్కులు: 4/10.

అవికూడా రాం నటనకు.. క్రిష్,స్పైడర్ మ్యాన్ యానిమేషన్లకు...